తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ మీడియట్ ఫలితాలు విడదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదలచేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొవిడ్ నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేపర్ వాల్యువేషన్ పూర్తి చేశాం. విద్యార్దులందరికి నా శుభాకాంక్షలు. ఇంటర్ బోర్డుపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇంటర్ ఫలితాలలో ఎలాంటి తప్పులకు తావివ్వోద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఫలితాలు సకాలంలో విడుదల చేసేందుకు సాయాపడిన అందరికీ కృతజ్ఞతలు. ఫలితాలలో ఎలాంటి మిస్టెక్స్ ఉండకుండా ఐసీఎంఆర్,ఇఎమ్ఆర్ పద్దతులను ఉపయోగించాం. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు. ’ అని ఆమె అన్నారు. ఈ నెల 22 వరకు కాలేజీలకు మార్కుల జాబితా అందిస్తామని ఆమె తెలిపారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రతికాలేజీలో కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు.

రాష్టం నుంచి మొత్తంగా 9,65,839 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్ లో 60.01 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ లో 68.86 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలబాలికల ఉత్తీర్ణత శాతాల విషయానికొస్తే.. ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత 67.47శాతం, బాలుర ఉత్తీర్ణత 52.30 శాతం. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 75.15, బాలుర ఉత్తీర్ణత శాతం 62.10 శాతంగా ఉంది. గత ఎడాదితో పోలిస్తే సెకండ్ ఇయర్ లో 18 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గత 5 సంవంత్సరాల కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. సెకండియర్ లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 76శాతంతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మేడ్చల్ జిల్లా 75 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లా 75 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. కొమరం భీం అసిఫాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలు 71 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. సెకండియర్ లో 1, 67, 942 మంది విద్యార్థులు ఏ గ్రేడు సాధించారు. వీరంతా 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించారు. అదేవిధంగా 80,096 మంది విద్యార్థులు బీ గ్రేడు సాధించారు. అంటే వీరంతా 60 నుంచి 70 శాతం మార్కులు సాధించారు. 27,423 మంది సీ గ్రేడు సాధించారు. వీరు 50 నుంచి 60 శాతం మార్కులు సాధించారు. 8406 మంది డీ గ్రేడు సాధించారు. వీరంతా 30 నుంచి 50 శాతం మార్కులు సాధించారు. మార్కులపై తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ ఏవైనా సందేహాలుంటే www.bigrs.telangana.gov.in లో ఆన్ లైన్ ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సబిత తెలిపారు.

ఫలితాల కోసం ఈ కింది లింకులను క్లిక్ చేయండి

ఎగ్జామ్ రిజల్ట్స్.టీఎస్.ఎన్ఐసీ.ఇన్

రిజల్ట్స్.సీజీజీ.జీవోవీ.ఇన్

టీఎస్బీఐఈ.సీజీజీ.జీవోవీ.ఇన్