కేసీఆర్ చర్యలతో పాతాళంలోకి తెలంగాణ : ఎల్ రమణ

కేసీఆర్ చర్యలతో పాతాళంలోకి తెలంగాణ : ఎల్ రమణ

సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సోమవారం ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించింది టీడీపీ. రాష్ట్ర  ముఖ్యనేతలంతా ఇందులో పాల్గొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ.. కేసీఆర్ చర్యలతో రోజు రోజుకు పాతాళంలోకి వెళ్తోందని విమర్శించారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నిధుల్లేవా అని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేసే వరకు టీడీపీ పోరాడుతుందన్నారు నేతలు.