పాత టెట్ హాల్ టికెట్ వెబ్సైట్ లో కొత్త ఆప్షన్

పాత టెట్ హాల్ టికెట్ వెబ్సైట్ లో కొత్త ఆప్షన్

హైదరాబాద్, వెలుగు: టీజీ టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక వెసులుబాటు కల్పించింది. గతంలో రాసిన టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లు మర్చిపోయి, రిజల్ట్స్ చూసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి వెబ్‌‌సైట్‌‌లో ప్రత్యేక లింక్‌‌ను అందుబాటులోకి తెచ్చినట్టు టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.

అభ్యర్థులు తమ పదో తరగతి సర్టిఫికెట్‌‌లోని పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఇప్పటివరకు రాసిన అన్ని టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లను సులభంగా తెలుసుకోవచ్చని సూచించారు. కాగా రాష్ట్రంలో జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగిసింది. పాత టెట్ మార్కుల వెయిటేజీకి కోసం చాలామందికి పాత హాల్ టికెట్ నంబర్లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు tgtet.aptonline.in వెబ్‌‌సైట్‌‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించారు.