
వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చింతల వెంకటరెడ్డికి హైదరాబాద్ లో ఆత్మీయ అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రైతునేస్తం చైర్మెన్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కన్నతల్లిని, నేలతల్లిని విస్మరిస్తే దౌర్భగ్యం, అనుసరిస్తే సౌభాగ్యమన్నారున నిరంజన్ రెడ్డి. సేంద్రియ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం వుందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.