హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌లో భాగస్వాములు కావాలని ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో జరుగుతున్న బీజీఎం 26 కాన్‌క్లేవ్ రెండో రోజు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బిట్స్ విద్యార్థుల నైపుణ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక మార్పులు వస్తున్న తరుణంలో నైతిక నాయకత్వం అవసరమని ఆయన వివరించారు.
ఈ సదస్సులో హ్యూమన్ సెంటర్డ్ ఏఐ, ఫ్రాంటియర్ టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఆదివారం ముగుస్తాయి.
