త్వరలో హైటెక్ సిటీని మించి ఉప్పల్ అభివృద్ధి

త్వరలో హైటెక్ సిటీని మించి ఉప్పల్ అభివృద్ధి

హైదరాబాద్ ఐటీ కంపెనీలకు హబ్ గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ లో జెనెక్ట్స్ సంస్థ విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీని మరింత విస్తరింపచేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని కేటీఆర్  అన్నారు. దీని కోసం గ్రిడ్ పాలసీ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే నాగోల్ లో శిల్పారామం కూడా ఏర్పాటు చేశామన్నారు.  త్వరలోనే హైటెక్ సిటీని మించి ఉప్పల్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయన్నారు. ఐటీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు.

కాగా, ఉప్పల్ లో జెనెక్స్ట్ స్క్వేర్ ఐటీ క్యాంపస్ విస్తరణ ప్రాజెక్టు పనులను రామ్ కీ గ్రూప్, జెన్ పాక్ట్ కలిసి చేపట్టనున్నాయి. రెండు మిలియన్ల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో దీని నిర్మాణం జరగనుంది. దీని భూమి పూజ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే నేతి సుభాష్ రెడ్డి, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ నరసింహ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన

రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

మోడీ గురించి మాట్లాడినప్పడు నీ కళ్లలో నీళ్లెందుకు రాలే?