రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తయిన శ్రీ రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని దర్శించుకున్నారు. అలాగే 108 దివ్య దేశాలను సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన 120 కిలోల బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ లో ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్నారు. 

కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో  భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. 7 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఒంటి గంట నుంచి సాధారణ భక్తులను అనుమతించటంలేదు. రాష్ట్రపతి పర్యటన ఉన్నందున సాధారణ ప్రజలు ముచ్చింతల్ రావొద్దని సూచిస్తున్నారు. ఇక.. శంషాబాద్ నుంచి ముచ్చింతల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం..

మోడీ గురించి మాట్లాడినప్పడు నీ కళ్లలో నీళ్లెందుకు రాలే?

ఏప్రిల్ 1 నుంచి ఆఫీసులకు రావాల్సిందే

ముఖ్యమంత్రిని ఓడించి తీరుతాం