హైదరాబాద్,వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకునేంత వరకు కార్మికులు, జర్నలిస్టులు పోరాటం చేయాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని ఖండించారు. కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఫెడరేషన్ అడ్ హక్ కమిటీ కన్వీనర్ పి. రాంచందర్ అధ్యక్షత వహించారు.
