ఏపీపీ పరీక్షను వాయిదా వేయాలి : జక్కుల వంశీకృష్ణ

ఏపీపీ పరీక్షను వాయిదా వేయాలి :  జక్కుల వంశీకృష్ణ
  • డీజీపీ ఆఫీస్​లో జూనియర్ అడ్వకేట్స్ వినతి 

బషీర్​బాగ్, వెలుగు: ఈ నెల 14న జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సర్పంచ్ ఎన్నికలు, ఏపీపీ పరీక్ష ఒకే రోజు ఉండడంతో వేలాది మంది అభ్యర్థులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు తీవ్ర నష్టమని అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ జక్కుల వంశీకృష్ణ తెలిపారు. 

శనివారం సైఫాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కారణంగా ఇప్పటికే టీజీ సెట్, నేషనల్ లోక్ అదాలత్ వాయిదా పడ్డాయని, అదే విధంగా ఏపీపీ పరీక్ష షెడ్యూల్​ను మార్చాలని కోరారు.