తెలంగాణ కిచెన్.. చపాతీ శ్నాక్

తెలంగాణ కిచెన్..  చపాతీ శ్నాక్

కావాల్సినవి : 

చపాతీ : ఒకటి 

మైదా : రెండు కప్పులు, 

కారం : ఒక టీస్పూన్

వెల్లుల్లి తరుగు : పావు టీస్పూన్

క్యాప్సికమ్, ఉల్లిగడ్డ : ఒక్కోటి

టొమాటో కెచప్​, సోయా సాస్, మిరియాల పొడి : ఒక్కోటి అర టీస్పూన్​ చొప్పున

ఉప్పు, నీళ్లు, నూనె : సరిపడా

తయారీ : చపాతీని ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో మైదా, కారం, ఉప్పు వేయాలి. అందులో నీళ్లు పోసి కలపాలి. తర్వాత చపాతీ ముక్కల్ని ఆ మిశ్రమంలో ముంచి, బయటకు తీసి నూనెలో వేగించాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. తర్వాత టొమాటో కెచప్, సోయా సాస్, మిరియాల పొడి, వేగించిన చపాతీ ముక్కలు కూడా వేసి కలపాలి.