తెలంగాణ కిచెన్ ..సేమ్యా ఇడ్లీ

తెలంగాణ కిచెన్ ..సేమ్యా ఇడ్లీ

కావాల్సినవి :

సేమ్యా : రెండు కప్పులు

పెరుగు : ఒక కప్పు

క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు : ఒక్కోటి అర కప్పు చొప్పున

పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్​ : ఒక టీస్పూన్

ఉప్పు : సరిపడా

నూనె : ఒక టేబుల్ స్పూన్

పోపు దినుసులు : ఒక టీస్పూన్

ఎండు మిర్చి : రెండు

కరివేపాకు : కొద్దిగా

తయారీ : ఒక గిన్నెలో పెరుగు, క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు వేగించాలి. ఆ పోపుని పెరుగు మిశ్రమంలో వేయాలి. అందులో సేమ్యా కూడా వేసి కలిపి మూతపెట్టాలి. అలా ఐదు నిమిషాలు పక్కన పెట్టాక ఆ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్​లో సర్ది ఉడికించాలి.