18 నుంచి 44 ఏండ్ల వాళ్లకు టీకాల్లో మనమే లాస్ట్ 

18 నుంచి 44 ఏండ్ల వాళ్లకు టీకాల్లో మనమే లాస్ట్ 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ చాలా స్లోగా ఉందని కేంద్రం విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా18- నుంచి 44 ఏండ్ల వయసు వాళ్లకు వ్యాక్సినేషన్ లో తెలంగాణ లాస్ట్ లో ఉంది. ఈ కేటగిరీలో ఇప్పటి వరకు 654 మందికి మాత్రమే ప్రభుత్వం టీకా వేయగలిగింది. లక్ష ద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ యూటీలతో పోల్చితే ఇది 10 శాతం మాత్రమే. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ తో పోల్చి చూసినా మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 18-– 44 వయసు వారిలో కోటి మందికి(1,06,21,235) పైగా వాక్సిన్ లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. రాజస్థాన్ 13,17,060 మందికి వ్యాక్సిన్ వేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. బీహార్12,27,279 మందికి వాక్సిన్ వేసి రెండో స్థానంలో ఉంది. యూపీ10.70 లక్షల మందికి వ్యాక్సిన్ లతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఢిల్లీ (9.15 లక్షలు), మధ్య ప్రదేశ్ (7.72 లక్షలు), మహారాష్ట్ర(7.06 లక్షలు), ఛత్తీస్ గఢ్ (7.01లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.   

21. 80 కోట్ల డోసులు ఇచ్చిన కేంద్రం 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21.80 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలు, యూటీలకు ఉచితంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1,80,43,015 డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 21,80,51,890 డోసులను రాష్ట్రాలకు ఇవ్వగా, వేస్టేజీతో కలిపి 20,00,08,875 డోసులను రాష్ట్రాలు, యూటీలు  వినియోగించుకున్నట్లు వివరించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 48,00,650 డోసులను ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.