ఆయిల్‌‌పామ్‌‌ సాగులో తెలంగాణ నంబర్‌‌ వన్‌‌ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్‌‌పామ్‌‌ సాగులో తెలంగాణ నంబర్‌‌ వన్‌‌ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : ఆయిల్​పామ్‌‌ సాగులో తెలంగాణ ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2024 – 25 సంవత్సరానికి , అశ్వారావుపేట, అప్పారావుపేట ఆయిల్‌‌పామ్‌‌ ఫ్యాక్టరీలో మూడు లక్షల టన్నుల ఆయిల్‌‌పామ్‌‌ గెలలను క్రషింగ్‌‌ చేసిన నేపథ్యంలో ఆదివారం రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆయిల్‌‌  ఫెడ్‌‌ చైర్మన్‌‌ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను అందించే సత్తా భారతదేశానికే ఉందన్నారు.

యూరియా వల్ల క్యాన్సర్‌‌ ప్రబలే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌‌పామ్‌‌ సాగవుతోందన్నారు. రైతులకు వ్యవసాయంలో మెళకువలపై అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు సైంటిస్ట్‌‌లతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ములకలపల్లి మండలంలో ఆయిల్‌‌పామ్‌‌ విస్తీర్ణం 10 వేల ఎకరాలకు పెరిగితే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతామని చెప్పారు. అనంతరం కేక్‌‌ కట్‌‌ చేశారు. సమావేశంలో ఆయిల్‌‌పామ్‌‌ రైతు సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, బండి భాస్కర్, ఆయిల్‌‌ఫెడ్‌‌ ఆఫీసర్లు సుధాకర్‌‌రెడ్డి, శ్రీకాంత్‌‌రెడ్డి, అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కళ్యాణ్‌‌ పాల్గొన్నారు.