వర్సిటీలు, కాలేజీల్లోని ఖాళీలను భర్తీ చేయాలి : కత్తి వెంకటస్వామి

వర్సిటీలు, కాలేజీల్లోని ఖాళీలను భర్తీ చేయాలి : కత్తి వెంకటస్వామి
  •     తెలంగాణ లెక్చరర్స్​ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి కోరారు. ఆదివారం హైదరాబాద్​సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కత్తి వెంకటస్వామి హాజరై మాట్లాడారు. 

మోడల్ స్కూళ్లలో పీజీటీ, టీజీటీల ప్రమోషన్స్ ట్రాన్స్​ఫర్లను వెంటనే చేపట్టాలని డిమాండ్​చేశారు. టీచింగ్, నాన్​టీచింగ్​స్టాఫ్​సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి సముచిత జీతభత్యాలు చెల్లించేలా చూడాలన్నారు. హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ సెలవులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వేణు, రజిని, గోపీనాథ్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.