స్థానిక ఎన్నికలపై పీఏసీలో నిర్ణయం

స్థానిక ఎన్నికలపై పీఏసీలో నిర్ణయం
  • ఆగస్టు 23న మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అజెండాపై చర్చ  
  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్, మంత్రి పొన్నం భేటీ 

హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల నిర్వహణపై పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏపీ) మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చించారు. ఈ నెల 23న జరగనున్న పీఏసీ సమావేశంలో చర్చించాల్సిన అజెండా అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికలను హైకోర్టు ఇచ్చిన గడువులోగా (సెప్టెంబర్ 30) నిర్వహించడమా? లేదంటే కోర్టును మరింత గడువు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయడమా? అనే దానిపై డిస్కస్ చేశారు.

బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అడ్డుపడుతుండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడంపై పీఏసీలో నిర్ణయం తీసుకొని, ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. పీఏసీ మీటింగ్ అజెండాలోని ముఖ్యమైన అంశాలపై మెజార్టీ నేతల అభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా, నిధులు, ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో తెలంగాణపై కేంద్రం చూపెడుతున్న వివక్షను జనంలో ఎండగట్టాలని నేతలకు సీఎం సూచించారు. వీటిపైనా పీఏసీలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నట్టు తెలిసింది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా చర్చ.. 

ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా చర్చించారు. నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచినట్టే జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ గెలవాలని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థి ఎవరనేది కాకుండా పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేసేలా కార్యకర్తలను రంగంలోకి దింపాలన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు బూత్ స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలని.. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా కమిటీలను వెంటనే ప్రకటించాలని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం సూచించారు. నామినేటెడ్ పదవులు విడతల వారీగా భర్తీ చేద్దామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.