తెలంగాణలో కొత్తగా 2,493  కరోనా కేసులు

 తెలంగాణలో కొత్తగా 2,493  కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 2,493 కొత్త కేసులు నమోదు కాగా, అదే సమయంలో 3,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93.70 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.04గా నమోదైంది.

రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది..దీని ప్రకారం..రాష్ట్రంలో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు. GHMC ఏరియాలో 318 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152 కేసులు గుర్తించారు. గడచిన 24 గంటల్లో 15 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా..5,44,294 మంది కోలుకున్నారు. ఇంకా 33,254 మందికి చికిత్స జరుగుతోంది.