సొంత అన్నదమ్ములైనా రాజకీయాల్లోకి వెళ్లి తలో పార్టీలో చేరారంటే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వెళ్తారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలను రంజుగా మారుస్తారు. అయితే.. ఓ జిల్లాలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు.. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా తయారయ్యారట. అసలు ఈ దోస్తానా కథేంటీ..? దాని వెనకాలున్న ఖతర్నాక్ నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
