అప్పుడు నిధులివ్వకుండా.. . కేటీఆర్ ఇప్పుడు నీతికథలు చెబుతున్నారు

అప్పుడు నిధులివ్వకుండా.. . కేటీఆర్ ఇప్పుడు నీతికథలు చెబుతున్నారు

తెలంగాణ మంత్రి సీతక్క  దూకుడు పెంచారు....మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.  వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ చెబుతున్నారని విమర్శించారు.  బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ లకు  నిధులు ఇవ్వకుండా ఘోష పెట్టిన కేటీఆర్... ఇప్పుడు సర్పంచ్ ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్ లు చేసిన అభివృద్దికి నిధులుమంజూరు చేయకుండా సర్పంచ్ లను వేధించడంతో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.  త్వరలోనే సర్పంచ్ లకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు

ములుగు జిల్లా అభివృద్దికి అధికంగా నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అన్నారు.  గోదావరి బెల్టుతో పాటు చిన్న చిన్న వాగులు... పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయన్నారు.  రామప్ప, లక్కవరం సరస్సులను అనుసంధానం చేసేందుకు గ్రావిటి కాలులు నిర్మించేందుకు ల్యాండ్ అక్విడేషన్ జరిగిందని.. డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో ఉన్నవారికి డబ్బులు చెల్లించాలని మంత్రి సీతక్క అధికారులను కోరారు,  

మేడారం జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు సహకరించాలన్నారు. జాతరకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు.  25, 28 తేదీల్లో మాత్రమే  మంత్రులు మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క కోరారు.