ఈ నెలలో 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వండి..కేంద్రమంత్రికి తుమ్మల విజ్ఞప్తి

ఈ నెలలో 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వండి..కేంద్రమంత్రికి తుమ్మల విజ్ఞప్తి

 

  •     ఖరీఫ్‌‌ సీజన్‌‌లో ఏర్పడిన లోటును భర్తీ చేయండి  
  •     కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌‌కుమంత్రి తుమ్మల విజ్ఞప్తి
  •     కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతోనూ భేటీ  
  •     బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గ్రీన్‌‌ఫీల్డ్ ఎయిర్‌‌‌‌పోర్టుపై వినతి

న్యూఢిల్లీ, వెలుగు:  ఖరీఫ్ సీజన్‌‌లో తెలంగాణకు రావాల్సిన యూరియాలో ఇప్పటి వరకు 2 లక్షల టన్నులు లోటు ఏర్పడిందని, దాన్ని ఈ నెలలోనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌‌కు విజ్ఞప్తి చేశారు. మంగ‌‌ళ‌‌వారం ఢిల్లీలో ఆమెతో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సంద‌‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా రబీ సీజన్‌‌లో ముందుగానే యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.  ప్రతి నెలా 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల కోరారు. కాగా, జియోపొలిటికల్ కారణాల వల్లనే యూరియా సరఫరాలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు ఎదురయ్యాయని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తుమ్మల తెలిపారు.

మరో ఇద్దరు కేంద్రమంత్రులతో భేటీ.. 

కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల మంత్రి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ కుమారస్వామితోనూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమయ్యారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరారు. ఈ అంశంపై త్వరలోనే సమావేశమవుదామని కుమారస్వామి హామీ ఇచ్చినట్టు తుమ్మల తెలిపారు. అలాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. కొత్తగూడెంలో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ప్రతిపాదించిన మేరకు విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘కొత్తగూడెంలోని భద్రాచలం రామ భక్తులకు ప్రధాన క్షేత్రం. సింగరేణి బొగ్గు క్షేత్రాలు, హెవీ వాటర్ ప్లాంట్, బీపీఎల్ యూనిట్లు వంటి పరిశ్రమలకు కేంద్రంగానూ ఉంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన కొత్తగూడెం ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ అవసరం. ఈ ప్రాంతంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి, అనువైన స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో అధ్యయనం చేపట్టండి. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించండి” అని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని,  వెంటనే అధికారులతో మాట్లాడారని తుమ్మల తెలిపారు.  

సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ..   

సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించిందని.. దేశంలో అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం సరఫరా చేయడంతో పాటు 20కి పైగా దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ రబీ సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించారు. సదస్సు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సదస్సులతో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ‘‘రబీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో సరిపడా సరఫరా చేయాలి. ఎరువుల కొనుగోలుకు సంబంధించి 25 శాతం పరిమితిని అన్ని పంటలకూ తొలగించాలి. జొన్న, మొక్కజొన్న పంటలను ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలి” అని కేంద్రాన్ని కోరారు.