ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు

మేడిగడ్డ పల్లర్లు కుంగినరోజు అసలేం జరిగిందో ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ప్రజలు వివరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రులు మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి, శ్రీధర్‌‌‌‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డిలు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కుంగిన ఘటనపై ఇరిగేషన్ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో సమీక్ష  చేస్తామన్నారు.

 మేడిగడ్డకు రావడం ఓ ప్రత్యేకత ఉందన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మూడు బ్యారేజీలపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.  పిల్లర్లు కుంగిపోవడంపై డ్యాం సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని...  అనుమానాలను తేల్చడానికి సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఇంజనీర్లు, అధికారులపై మాకు ఎలాంటి ద్వేషం లేదని... ఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలని అన్నారు. టెక్నికల్ గా ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. కరకట్టలతో ముంపు రైతులను ఆదుకుంటామని ఆయన తెలిపారు. మరికాసేపట్లో మంత్రులకు మేడిగడ్డ పిల్లర్ల కుంగిన ఘటనపై  ఇరిగేషన్ అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.