రాష్ట్ర ప్రజా ప్రతినిధుల విదేశీ టూర్లు

రాష్ట్ర ప్రజా ప్రతినిధుల విదేశీ టూర్లు

రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులంతా విదేశాల బాట పట్టారు. రాష్ట్రంలో పొలిటికల్ సిచ్చువేషన్స్ హీటెక్కుతోన్న టైమ్ లో ప్రజా ప్రతినిధులు మాత్రం ఫారిన్ టూర్లు వేయడంపై అంతటా విమర్శలొస్తున్నాయి. ఉన్నపళంగా నేతలంతా ఒకేసారి విదేశాలకు వెళ్లడం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ నడుస్తోంది. రాష్ట్రం నుంచి సగం మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విదేశీ టూర్లతో సేదతీరుతున్నారు. అందులోనూ గడిచిన నెల రోజుల టైమ్ లో  మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, కేటీఆర్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, మరికొంతమంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎంపీలు నాటా, ఆట సభలకు వెళ్లారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి కూడా అమెరికా వెళ్లివచ్చారు.

రాష్ట్రంలోని అన్ని పార్టీల ముఖ్య నేతల టూర్లపై అధికార, విపక్ష నేతలు ఒకరినొకరూ తిట్టిపోసుకుంటుండంతో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. ఇక ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, ఇతర ముఖ్య లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ప్రతిపక్షాలను కార్నర్ చేయాల్సిన మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం ఫారిన్ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక చాలా మంది నేతలు వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళితే మరికొంతమంది అధికార కార్యక్రమాల కోసం వెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికలకు చాలా టైమ్ ఉన్నా... పొలిటికల్ పార్టీల యాక్టివిటీస్ ఇవాళో, రేపో అన్నట్టుగా మారాయి. టైమ్ దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి హైదారాబాద్ టూర్లో గులాబీ బాస్ నేరుగా మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. అటు పరేడ్ గ్రౌండ్ విజయ్ సంకల్ప్ సభలో ఎక్కడా కేసీఆర్ పేరు ప్రస్తావించని మోడీ... తెలంగాణకు ఏం ఇచ్చారో లెక్కలతో వివరించారు. రాష్ట్ర మంత్రులు బీజేపీకి ధీటుగా కౌంటర్లు ఇవ్వడం లేదనే చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది. మంత్రులు కేవలం ప్రెస్ నోట్లకే పరిమితమయ్యానే విమర్శలు పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నాయి.