ఈసారి ప్రతిపక్షం చాన్స్ బీజేపీకి ఇవ్వండి!..బాధ్యతలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించొద్దు: ఎమ్మెల్యే యెన్నం

ఈసారి ప్రతిపక్షం చాన్స్ బీజేపీకి ఇవ్వండి!..బాధ్యతలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించొద్దు: ఎమ్మెల్యే యెన్నం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​కు అధికారా న్ని అప్పగిస్తూనే ప్రతి పక్ష పార్టీ హోదా బీజే పీకి దక్కేలా చూడాలని మహబూబ్​నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అధికార దాహంతో మితిమీరి ప్రవర్తిస్తున్న 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా గెలి పించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాల సీపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భం గా ఎమ్మెల్యే శ్రీనివాస్​రెడ్డి మాట్లాడారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాళ్లు సభలో ఉండకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు.