
- తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమకు 11 ఏండ్లుగా బదిలీలు లేవని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని టీచర్లు కోరారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ‘సీఎం సార్ మమ్మల్ని బదిలీ చేయండి’ అంటూ టీచర్లు నిరసన దీక్ష చేపట్టారు. జేఏసీ ప్రతినిధులు కత్తి వెంకటస్వామి, అరవింద్ ఘోష్, రాజశ్రీ, సాయి చరణ్, రవీందర్, శివప్రసాద్, గోపీనాథ్
దేవి ప్రసాద్, పద్మ, రజని, జ్యోతి మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ కారణంగా దాదాపు 3వేల మంది టీచర్లు కుటుంబాలు, పిల్లలకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ప్రభుత్వమైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసన దీక్షలో సాజిద్, ఇర్ఫాన్ అలీ, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.