- ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆరో తరగతిలో అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఏప్రిల్ 19న ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, దీనికి ఏప్రిల్ 9వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆరో తరగతిలో అడ్మిషన్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి అడ్మిషన్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు.
