
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ల గడువు ఎల్లుండి(మార్చి-25)తో ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసేవారి సంఖ్య రోజుకురోజుకు పెరుగుతుంది. తాజాగా ప్రధాన పార్టీలకు చెంది పలువురు ముఖ్య నాయకులు MLA,MP అభ్యర్ధిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. AP సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, పవన్ కళ్యాణ్ ,AP మంత్రులు తెలంగాణ నుంచి TPCC చీఫ్ ఉత్తమ్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. వీరిలో చాలామంది నేతలు ఆర్థికంగా బలంగా ఉన్నవారే. వారి వారి నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ..తెలంగాణలో ఎంపి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తుల పరంగా అగ్రస్థానంలో ఉన్నారు. తనకు రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో తెలిపారు.
మరోవైపు ఏపిలో మంత్రి నారాయణ ఆస్తుల పరంగా అగ్రస్థానంలో నిలిచారు. రూ. 650 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ తన ఆస్తులు రూ339 కోట్లుగా పేర్కొన్నారు. ఐతే 2014తో పోలిస్తే జగన్ ఆస్తుల విలువ తగ్గినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా నరసాపురం YCP అభ్యర్థి రఘురామ కృష్టంరాజు ఆస్తులు రూ.324 కోట్లు కాగా, గుంటూరు TDP అభ్యర్థి గల్లా జయదేవ్ ఆస్తుల విలువ రూ. 266 కోట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. సీనీనటుడు బాలకృష్ట చిన్న అల్లుడు భరత్‌కు రూ. 200 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్ లో తెలిపారు.