వెరీ ఇంట్రస్టింగ్ : మన ఎంపీలు.. ప్రమాణం చివర్లో నినాదాలు

వెరీ ఇంట్రస్టింగ్ : మన ఎంపీలు.. ప్రమాణం చివర్లో నినాదాలు

లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం ఆసక్తి కలిగించింది. కొందరు సభ్యులు తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివర్లో తమదైన శైలిలో నినాదాలు చేసి ఆకట్టుకున్నారు. అక్షర క్రమంలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

ముందుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూ రావు(బీజేపీ) తెలుగులో ప్రమాణం చేశారు. 

తర్వాత పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బూర్లకుంట వెంకటేశ్(టీఆర్ఎస్) తెలుగులో ప్రమాణం చేశారు. జై తెలంగాణ .. జైజై భారత్ అంటూ స్లోగన్ తో ప్రమాణం పూర్తిచేశారు. 

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(బీజేపీ).. తెలుగులో ప్రమాణం చేసి భారత్ మాతాకీ జై నినాదం ఇచ్చారు. 

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(బీజేపీ).. ఇంగ్లీష్ లో ఓత్ తీసుకుని.. చివర్లో భారత్ మాతాకీ జై అనే స్లోగన్ ఇచ్చారు. 

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) హిందీలో చేసిన ప్రమాణాన్ని జై తెలంగాణ… జైజై తెలంగాణ.. స్లోగన్ తో ముగించారు. 

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(టీఆర్ఎస్) తెలుగులో ఓత్ తీసుకున్నారు. చివర్లో జై భారత్.. జై తెలంగాణ అని నినాదం చేశారు. 

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి(కాంగ్రెస్).. తెలుగులో ప్రమాణం చేశారు.

భారత్ మాతాకీ జై నినాదాల మధ్య.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(మజ్లిస్) ఉర్దూలో ప్రమాణం పూర్తిచేశారు. జై భీమ్.. జై మీమ్.. తక్బీర్ అల్లాహోఅక్బర్.. జై హింద్ అనే స్లోగన్ ఇచ్చి ముగించారు. 

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్) ఇంగ్లీష్ లో ప్రమాణం చేశారు. 

మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్) ఇంగ్లీష్ లో ఓత్ తీసుకున్నారు.

నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు(టీఆర్ఎస్) తెలుగులో ప్రమాణం చేశారు. 

నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్) ఇంగ్లీష్ లో ప్రమాణం చేసి… జైహింద్.. జై తెలంగాణ అనే స్లోగన్ ఇచ్చారు.

భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్)..తెలుగులో ప్రమాణం చేశారు. ..

వరంగల్ ఎపీ పసునూరి దయాకర్(టీఆర్ఎస్) తెలుగులో ప్రమాణం చేశారు.

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తెలుగులో ఓత్ తీసుకుని.. చివర్లో జై తెలంగాణ.. జై బంజారా..అంటూ తనదైన శైలిలో ముగించారు. ఆమె ప్రమాణానికి వస్తున్న టైమ్ లో కవితమ్మ పోయినా… టీఆర్ఎస్ లో ఈ కవిత ఉన్నారు అనే వాయిస్ వినిపించింది.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలుగులో ప్రమాణం చేశారు.జై తెలంగాణ లాంటి ఏ నినాదం ఆయన ఇవ్వలేదు.