
ఖైరతాబాద్,వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్‌లను అభివృద్ధి చేసిందని, ఆ పార్టీకే తాము మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ముదిరాజ్మహాసభ విద్యావంతుల వేదిక చైర్మన్ సీహెచ్ దినేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మత్య్సకారులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు చెరువులను నింపి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి మత్స్యకారుల ఆదాయం రూ.2.479 కోట్లు మాత్రమే ఉంటే.. ప్రస్తుతం రూ.7,259 కోట్లకు పెరిగినట్లు చెప్పారు.