
- వెళ్లిన వారిలో ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, హౌసింగ్ ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పలు శాఖల ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానికి వెళ్లిన వారిలో తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తో పాటు పలువురు హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిధుల బకాయిల అంశంపై వారు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను కలిసి చర్చించనున్నారు.
పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి రూ.120 కోట్లు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలో గృహలక్ష్మి స్కీమ్ ను స్టార్ట్ చేయనున్నందున, ఆ స్కీంకూ పీఎం ఆవాస్ యోజన నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరునున్నారు.