కార్మిక సంక్షేమ బోర్డు అక్రమాలపై విజిలెన్స్..2018-19 నుంచి జరిగిన క్లెయిమ్‌‌లపై దర్యాప్తు

కార్మిక సంక్షేమ బోర్డు అక్రమాలపై విజిలెన్స్..2018-19 నుంచి జరిగిన క్లెయిమ్‌‌లపై దర్యాప్తు
  •     మంచిర్యాలలో 91 డెత్‌‌ క్లెయిమ్‌‌లలో 80 బోగస్‌‌
  •     ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి (టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ)లో సంక్షేమ పథకాల క్లెయిమ్‌‌ల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్​మెంట్‌‌ దర్యాప్తునకు ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన విచారణలో భారీగా బోగస్‌‌ క్లెయిమ్‌‌లు, నిధుల దుర్వినియోగం బయటపడటంతో.. 2018–-19 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన క్లెయిమ్‌‌లపై దర్యాప్తు చేయాలని సీఎస్‌‌ సంజయ్‌‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. 

మంచిర్యాల క్లెయిమ్‌‌లపై జరిగిన విచారణలో 15 వికలాంగ క్లెయిమ్‌‌లూ బోగస్‌‌ అని తేలింది. 91 ప్రమాద మరణాల క్లెయిమ్‌‌లలో 11 మాత్రమే సరైనవని, 80 నకిలీవని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి మంచిర్యాల ఇన్‌‌చార్జ్‌‌ ఏసీఎల్‌‌, ఏఎల్‌‌వోలను సస్పెండ్‌‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2018-–19 నుంచి జరిగిన సంక్షేమ పథకాల క్లెయిమ్‌‌లను విజిలెన్స్‌‌ అధికారులు పరిశీలించనున్నారు. డిజిటల్‌‌ పోర్టల్స్‌‌, రిజిస్టర్లు, అప్లికేషన్‌‌ లాగ్స్‌‌, ఒరిజినల్‌‌ క్లెయిమ్‌‌ ఫైళ్లను విజిలెన్స్‌‌కు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.