బీఆర్ఎస్ లీడర్లను ప్రజలు అసహ్యించుకుంటున్నరు..అధికారంలో ఉన్నంతకాలం రైతులను కష్టపెట్టిన్రు

బీఆర్ఎస్ లీడర్లను ప్రజలు అసహ్యించుకుంటున్నరు..అధికారంలో ఉన్నంతకాలం రైతులను కష్టపెట్టిన్రు
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • హనుమకొండలో ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా

హనుమకొండ, వెలుగు : ‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయకుండా రైతులపై రూ.12 వేల కోట్ల వడ్డీ భారం మోపింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం, అయినా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు పనికిమాలిన మాటలతో రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

బీఆర్ఎస్ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వారి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా జన్మలో ప్రజాదరణ పొందలేరని విమర్శించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం జరిగిన మెగా రైతు మేళా ముగింపు కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో కలిసి హాజరయ్యారు. ముందుగా స్టాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

అనంతరం సేంద్రియ సాగులో లాభాలు సాధిస్తున్న రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పదేండ్లలో రైతుల కష్టాలు పట్టించుకోని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛీ కొట్టి బయటకు పంపేస్తే.. రైతుల కష్టాలను ఓట్లుగా మార్చుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు.

రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని,  రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదన్నారు. దేశంలోనే ధాన్యం ఎక్కువ పండించేది, ఎక్కువ కొనుగోలు చేసేది కూడా తెలంగాణే అని చెప్పారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో యాంత్రీకరణ, పంట నష్టం, ఇతర పథకాలన్నీ ఆపేసిందని, పదవీలో ఉన్నంతకాలం రైతులను కష్టపెట్టిందన్నారు.

యుద్ధం కారణంగా యూరియా సరఫరా ఆగిపోయినా కేంద్రంతో కొట్లాడి 11 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి రైతులకు అందించామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు.

కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాస్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్య శారద పాల్గొన్నారు.

పంట మార్పిడి చేస్తేనే లాభాలు : మంత్రి కొండా సురేఖ

రైతులంతా ఒకే పంట సాగు చేస్తే దిగుబడి ఎక్కువై గిట్టుబాటు ధర దక్కదని, పంట మార్పిడి విధానం పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని మంత్రి కొండా సురేఖ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి.. రైతులకు అన్ని రకాలుగా రాయితీలు ఇస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. జైశ్రీరాం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కేంద్రమంత్రులు నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలన్నారు.