పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలి : మాదగోని సైదులుగౌడ్

పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలి : మాదగోని సైదులుగౌడ్

బషీర్​బాగ్, వెలుగు: పీఈటీ, పీడీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగుల, ప్రైవేట్​ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్​ డిమాండ్  చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో డీఎస్సీ ద్వారా రెగ్యూలర్ పద్ధతిలో భర్తీ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ప్రకటించాలని కోరారు.