ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ తేదీలను తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయని వెల్లడించింది. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు వేర్వేరుగా తేదీలను వెల్లడించింది. ప్రస్తుతం ఈవెంట్స్ ఈనెల 5తో ముగియనున్నాయి.
ఎస్సై పరీక్షలు...
ఎస్సై మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్‌పోర్ట్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్సై అభ్యర్థులకు మొదటి రెండు పేపర్లను నిర్వహిస్తారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్థమెటిక్, రీజనింగ్ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లిష్ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ 9న ఉదయం సివిల్ ఎస్సై అభ్యర్థులకు మూడో పేపర్ జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు జరుగుతాయి. ఎస్సై మెయిన్ ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కానిస్టేబుల్ ఎగ్జామ్స్..
సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష.. మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఏఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 26న ఉదయం ట్రాన్స్‌పోర్ట్ ఎస్సై టెక్నికల్ పరీక్ష.. ఏప్రిల్ 2న ఉదయం కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు టెక్నికల్ పరీక్షలు జరుగుతాయి. మధ్యాహ్నం కానిస్టేబుల్, మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, డ్రైవింగ్ టెస్టులకు సంబంధించిన తేదీలను తె త్వరలో వెల్లడిస్తామని లంగాణ పోలీసు నియామక మండలి పేర్కొంది.