టర్మినేట్‌‌ అయిన వారిని డ్యూటీలోకి తీసుకునేందుకు ఓకే

టర్మినేట్‌‌ అయిన వారిని డ్యూటీలోకి తీసుకునేందుకు ఓకే

హైదరాబాద్, వెలుగు: జీతాలు పెంచాలంటూ విద్యుత్‌‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె విరమించారు. సీఎండీతో చర్చల తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్‌‌ నేతలు ప్రకటించారు. బుధవారం విద్యుత్‌‌ సౌధలో జెన్‌‌కో, -ట్రాన్స్‌‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌‌రావుతో ఎమ్మెల్యే అహ్మద్‌‌ బలాల, యూనియన్‌‌ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి.

మంగళవారం సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరగా, సీఎండీ సానూకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌‌రావు మాట్లాడుతూ, ‘‘సమ్మె చేయొద్దని చెప్తే వినలేదు. సమ్మె చేసి ఏం సాధించారు”అని వారిని ప్రశ్నించారు. ఆర్టిజన్లకు 7% ఫిట్‌‌మెంట్‌‌ పెంపు సరిపోదని, 50 శాతం పెంచడంతో పాటు 18 డిమాండ్లతో ఆర్టిజన్లు గత సోమవారం నుంచి సమ్మెకు దిగారు. తాజాగా, సీఎండీతో చర్చలు జరిపిన సక్సెస్‌‌ కావడంతో సమ్మె విరమిస్తున్నటు ఆర్టిజన్‌‌ నేతలు తెలిపారు.