తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ : ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ : ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణలో  గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.  అయితే మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 

సెప్టెంబర్ 7  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని  తెలిపింది. 

ALSO READ :ఏపీలో ముగ్గురు రాక్షసులు తయారయ్యారు:మంత్రి అంబటి

సెప్టెంబర్ 8 న చాలా చోట్ల,  సెప్టెంబర్ 9న  కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు   చాలాచోట్ల పంటల దెబ్బతిన్నాయి.