దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ

దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న  టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ
  •     రాష్ట్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డికి చోటు

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోనే అత్యధిక సంఖ్యలో కాలేజీలు  కలిగిన తొలి పది  రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు దక్కించుకుంది. ఆల్‌‌‌‌ ఇండియా సర్వే ఆన్‌‌‌‌ హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌(ఏఐఎస్‌‌‌‌హెచఈ) 2023–24 రిపోర్ట్ ప్రకారం... రాష్ట్రంలో మొత్తం 2,160 కళాశాలలు ఉన్నట్లు తెలింది. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ హెచ్ఈ మొత్తం 358 పేజీలతో 2022–23 రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో 18 నుంచి 24 ఏండ్ల మధ్య  ప్రతి లక్ష మంది అర్హులైన జనాభాకు 56 కాలేజీలు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. జాతీయ సగటు32 శాతం  కంటే చాలా ఎక్కువని వెల్లడించింది. ముఖ్యంగా  హైదరాబాద్‌‌‌‌(465 కాలేజీలు), రంగారెడ్డి(338 కాలేజీలు) ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా... తెలంగాణలో 84, 568 మంది ఉపాధ్యాయలతో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. 

వీరిలో 9, 596 మంది ఎస్సీ, 2,996 ఎస్టీ, 35, 066 మంది ఓబీసీలు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. ప్రతి ఒక్క లక్ష మంది అర్హులైన విద్యార్థులకు అత్యధిక కాలేజీల జాబితాలో తెలంగాణ (56  కాలేజీలు) సెకండ్ ప్లేస్ లో, ఏపీ(51) మూడో స్థానంలో నిలిచాయి. కాగా, 108354 మందితో అత్యధికంగా టీచర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. ఎస్సీ వర్గానికి చెందిన 16,578 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 1,907 మంది, ఓబీసీకి చెందిన 39,723 మంది  ఉపాధ్యాయలు  ఏపీలో ఉన్నారు. అయితే ఏపీలోని కాలేజీ స్టూడెంట్స్ ఎనరోల్‌‌‌‌మెంట్‌‌‌‌ సగటు 517 కాగా, తెలంగాణలో 618గా సర్వే లో వెల్లడైంది.