స్వచ్ఛతలో తెలంగాణకు 5 అవార్డులు

స్వచ్ఛతలో తెలంగాణకు 5 అవార్డులు

స్వచ్ఛతలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కొనియాడారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగి న స్వచ్ఛ్​మహోత్సవ్ 2019 అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొన్ నారు. స్వచ్ఛత
ప్రమాణాల అమలులో ముందున్న ప్రాంతాలు, వ్యక్తులకు ఆయన అవార్డులు అందజేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్డులు దక్కాయి. స్వచ్ఛతలో దేశంలోనే మూడోస్థా నం నిలిచిన పెద్దపల్లి తరఫున జిల్లా కలెక్టర్ దేవసేన, రాష్ట్ర స్థాయిలో
తెలంగాణ తరఫున పంచాయతీ రాజ్ కమిషనర్ నీతుకుమారి ప్రసాద్​లు అవార్డు అందుకున్నారు. ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యా ల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమణలకు మంత్రి అవార్డులు అందజేశారు. జిల్లాల ప్రత్యేక విభాగంలో వరంగల్ కు అవార్డు లభించింది. టాయిలెట్ల నిర్మాణం, వినియోగం, పరిశుభ్రత.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులు ప్రకటించారు.