
హైదరాబాద్ : హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 51,518 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 569 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత 24గంటల్లో 2098 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇవాళ ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 8379 యాక్టివ్ కేసులున్నాయి.