తెలంగాణలో 129 కరోనా కేసులు

తెలంగాణలో 129 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మహమ్మారి అంతరించినట్లేనని భావిస్తున్న తరుణంలో కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సూచిస్తున్నారు.  

ఇక కేసుల విషయానికి వస్తే రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 13,254 మందికి పరీక్షలు చేయగా 129 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదేవిధంగా గత 24 గంటల్లో 67 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,111 మంది మరణించారు. రికవరీ రేటు 99.35 శాతంగా ఉందని వెల్లడించింది. నమోదైన 155 కరోనా కేసుల్లో ఒక్క హైదరాబాదులోనే 104 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 9, మల్కాజిగిరిలో 8 కేసులు నమోదయ్యాయి.