రాష్ట్ర వ్యాట్ కారణంగానే...తెలంగాణలో అత్యధిక పెట్రోల్ ధరలు : మంత్రి సురేశ్ గోపీ

రాష్ట్ర వ్యాట్ కారణంగానే...తెలంగాణలో  అత్యధిక పెట్రోల్ ధరలు : మంత్రి సురేశ్ గోపీ
  •     కేంద్రమంత్రి సురేశ్ గోపీ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ వల్లే తెలంగాణలో అత్యధిక పెట్రో ధరలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్‌‌ ధర ఏకంగా రూ.13, డీజిల్‌‌ ధర రూ.8 చొప్పున అదనంగా ఉందని తెలిపారు.

 కేంద్రం పెట్రోల్‌‌పై రూ.21.90, డీజిల్‌‌పై రూ.17.80 విధిస్తోన్న సుంకం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉందన్నారు. తెలంగాణలో లీటర్‌‌ పెట్రోల్‌‌పై రూ.26.92, డీజిల్‌‌పై రూ.19.80 వ్యాట్‌‌ వసూలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెండ్డి అడిగిన ప్రశ్నకు సురేశ్ గోపి సమాధానం ఇచ్చారు.