రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌‌‌‌లో 14.8 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌‌‌‌లో 14.8 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. గురువారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్​, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్​, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నారాయణపేట, నాగర్ ​కర్నూల్​, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. గురువారం రాత్రి అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లా బేలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. 

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా లింగాపూర్​లో 15.2, సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 16, రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 16.4, వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 16.5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 16.8, మెదక్​ జిల్లా దొంగల ధర్మారంలో 16.9, జగిత్యాలలో 17, నిజామాబాద్​ జిల్లా సాలూరలో 17.1, రంగారెడ్డి జిల్లా కందువాడలో 17.3, సిద్దిపేట జిల్లా కొండపాకలో 17.4, నిర్మల్​ జిల్లా తాండ్రలో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.