హైదరాబాద్, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలకు రెరా భారీ జరిమానా విధించింది. బుధవారం రేరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస రావు విచారణ జరిపి ఫైన్లు వేశారు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు చేపట్టిన ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ‘ఏవీ ఈస్ట్ రెసిడెన్సీ’ ప్రాజెక్ట్‌పై రూ. 2 లక్షల83 వేల140, ఇదే కంపెనీకి చెందిన ‘ఏవీ వెస్ట్ హైట్స్’ ప్రాజెక్టుపై రూ.14 లక్షల 84 వేల 184- జరిమానా విధించారు. సేల్ అగ్రిమెంట్ చేయకుండా 25% డబ్బు వసూలు చేసిన ‘అధూరి ఇన్ ఫ్రా’ కు రూ.6 లక్షల 77 వేల 966,- భారీ జరిమానా వేశారు.
రెరా చట్టం ప్రకారం సేల్ అగ్రిమెంట్ చేయకుండా కొనుగోలుదారుల నుంచి అగ్రిమెంట్ మొత్తం విలువలో 10% కంటే ఎక్కువ డబ్బు వసూలు చేయరాదు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, హెచ్ఎండీఏ అనుమతులు పొందకుండా విక్రయాలు చేపట్టిన ఎస్వీ ఎం ఆదిత్య హోమ్స్ కంపెనీకి చెందిన ‘టెక్ హోమ్స్’ ప్రాజెక్టుపై రూ.43 లక్షల 16 వేల 480 చొప్పున భారీ జరిమానా విధించారు.
