Telangana result: కౌంటింగ్ షురూ.. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

Telangana result: కౌంటింగ్ షురూ.. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

తెలంగాణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది.  మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 లక్షల ఓట్లు పోలయ్యాయి. 8.30 గంటల తర్వాత ఈవీఎంలు లెక్కించనున్నారు. మొదటి ఫలితం 10 గంటల  వరకు రానుంది. మొదటి ఫలితం చార్మినార్ లేదా అశ్వరావుపేట, భద్రాచలం ఫలితం రానుంది.  మధ్యాహ్నం ఒంటింగంట వరకు ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనేది  తెలుస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు అన్ని పార్టీల అభ్యర్థులు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగగా 2 వేలకు పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు.