బషీర్బాగ్, వెలుగు: పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ సర్పంచుల సంఘం మంగళవారం గోషామహల్ లో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపింది. బిల్లులు రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంఘం జేఏసీ అధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్ మాట్లాడుతూ తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్చేశారు.
