సర్పంచుల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తం : రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి

సర్పంచుల హక్కుల రక్షణ కోసం కృషి చేస్తం :   రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి
  • సర్పంచుల సంఘం 
  • రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో గ్రామ పంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఆశా దీప్ రెడ్డి తెలిపారు. బుధవారం బషీర్ బాగ్​లో నిర్వహించిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సర్పంచులందరికీ ఆశా దీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

రానున్న రోజుల్లో జిల్లాల వారీగా పర్యటించి సర్పంచుల చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్టు చెప్పారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నూతన సర్పంచులు చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా పరిపాలన సాగించాలని, అందుకు అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కీర్తి రామకృష్ణ, జమునా నాయక్, అవినాష్ కుమార్, లోపల్లి శ్రీనివాసరావు, పెంటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.