ప్రమోషన్లు వెనక్కి తీస్కుంటే ఊకోం

ప్రమోషన్లు వెనక్కి తీస్కుంటే ఊకోం

ఖైరతాబాద్, వెలుగు: ఏపీ నుంచి వచ్చిన 84 మంది ఉద్యోగుల కారణంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల పదోన్నతులను వెనక్కి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్యామ్ మనోహర్ హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఏపీ నుంచి వచ్చిన 84 మందికి సూపర్ న్యూమరరీ పోస్టులు, నోస్టర్ విధానంలో పదోన్నతులు ఇవ్వవచ్చని, లేదంటే తాము నష్టపోతామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ముగ్గురు సీఎండీలతో ప్రభుత్వం మాట్లాడాలని కోరారు. దీనిపై సర్కార్ వైఖరి ప్రకటించని పక్షంలో మెరుపు సమ్మెకు వెళతామని హెచ్చరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి మేడి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ వారికి రివర్షన్ ఇచ్చి, ఆంధ్రా ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.