జులై 31లోగా సెక్రటేరియెట్​ కూల్చివేత

జులై 31లోగా సెక్రటేరియెట్​ కూల్చివేత

కొత్త సెక్రటేరియెట్ కు ఈ నెల 27న భూమి పూజ చేయనున్న నేపథ్యం లో పాత సెక్రటేరియెట్ ను కూల్చి వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 31 వరకు కూల్చివేత పనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సీఎం కూడా అప్పటిలోగా కూల్చి వేతను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. పాత సెక్రటేరియెట్ స్థలంలోనే కొత్త సెక్రటేరియెట్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కూల్చి వేత కారణంగా ఆయా బ్లాకుల్లోని ఆఫీసులను ఇతర ప్రాంతాలకు తరలించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి పూజ తర్వాత సెక్రటేరియట్ లో ని శాఖలన్నిం టినీ తరలించేం దుకు
సిద్ధమవుతున్నారు. మరో వైపు తమ శాఖను ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపైన ఆయా శాఖల ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. దీనిపై మీడియా ప్రతినిధుల దగ్గర ఆరా తీసున్నారు.

బీఆర్కే భవన్ లో సీఎంవో
సెక్రటేరియెట్ లో సుమారు 34 శాఖలు ఉన్నాయి. చాలా శాఖలను ఆయా శాఖల కమిషనరేట్ లకు తరలించాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మరో ఆలో చ న చేస్తున్నారు. సీఎంవో, సీఎస్ పేషీ, సాధారణ పరిపాలన శాఖ, ఫైనాన్స్
శాఖలను మాత్రం బీఆర్కే భవన్ కు తరలిస్తుండగా, పంచా యతీ రాజ్ డిపార్ట్ మెంట్ ను ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ ఆఫీస్ కు తరలించనున్నారు. ఇక రవాణా శాఖను ఖైరతాబాద్ లో ని ఆర్టీఏ కార్యాలయం లేదా బస్ భవన్
కు తరలించనున్నారు.