రాష్ట్రానికి 148 టీఎంసీల నీళ్లు కావాలి

రాష్ట్రానికి 148 టీఎంసీల నీళ్లు కావాలి
  • రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి..కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు డిసెంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం 148 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ)ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కోరింది. ఈ మేరకు కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌కు ఇంజినీర్- ఇన్- చీఫ్ (ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ) జనరల్ మహ్మద్ అంజద్ హుస్సేన్ నీటి అవసరాలపై ఇండెంట్ పెడుతూ  లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి తమకు 148 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద సాగునీటి కోసం 25 టీఎంసీలు, తాగునీటి కోసం 5 టీఎంసీలు కలిపి మొత్తం 30 టీఎంసీలు ఇవ్వాలన్నారు.  

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద సాగుకు 75 టీఎంసీలు, తాగునీటికి 5 టీఎంసీలు కలిపి 80 టీఎంసీలు ఇవ్వాలని కోరారు. అలాగే, ఏఎమ్మార్పీ కింద సాగుకు 28 టీఎంసీలు, తాగునీటికి 10 టీఎంసీలు కలిపి 38 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్నారు. మొత్తంగా,148 టీఎంసీల నీటిలో 128 టీఎంసీలు సాగు అవసరాల కోసం, 20 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ తన ఇండెంట్ లేఖలో పేర్కొన్నారు. ఈ నీటి విడుదలకు రిలీజ్ ఆర్డర్లు జారీ చేయాలని ఆయన కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీని రిక్వెస్ట్ చేశారు.