
SSC రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ఈ రోజు సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పదో తరగతి ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు పరీక్ష రశారని తెలిపారు. మొత్తం 92.43 శాతం పాస్ అయ్యారని చెప్పారు. జగిత్యాల జిల్లా 99.78 శాతం తో మొదటి ప్లేస్ లో ఉందని తెలిపారు.83.09 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ఉందని తెలిపారు.
ప్రైవేటు స్కేళ్లలో 56.53 శాతం విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు జనార్ధన్ రెడ్డి. 98.78 అగ్ర స్థానంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిలిచాయని తెలిపారు. పరీక్షలలో ఫేయిల్ అయిన వారికి . 10 జూన్ నుంచి 24 జూన్ వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. మే 27 వ తేదీ లోగా ఫేయిల్ అయన వారు అప్లై చేసుకోవచ్చని అన్నారు. 4వేల 300 వందల స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. 9 స్కూళ్లలో సున్నా శాతం రిజల్ట్ వచ్చిందని అన్నారు. బాలురు 91.18 శాతం బాలికలు 93.68 శాతం పాస్ అయ్యారు. గతంలో కంటే ఈ సారి 8శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు.