ఎస్టీ విద్యార్థులు సివిల్స్ ర్యాంకులు సాధించాలి : ఎస్టీ స్పెషల్ సెక్రటరీ బీఎం సంతోష్

ఎస్టీ విద్యార్థులు సివిల్స్ ర్యాంకులు సాధించాలి : ఎస్టీ స్పెషల్ సెక్రటరీ బీఎం సంతోష్

హైదరాబాద్, వెలుగు: ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ను ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ బీఎం సంతోష్ శుక్రవారం తనిఖీ చేశారు. రాజేంద్రనగర్ లోని స్టడీ సర్కిల్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చే ఏడాది ప్రిలిమ్స్ పరీక్షకు ఇటీవల సివిల్ సర్వీసెస్ బ్యాచ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. స్టడీ సర్కిల్ లో ఉన్న వసతులు, లైబ్రరీ, డైనింగ్, స్టడీ రూమ్, కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. 

పాఠ్యాంశ ప్రణాళిక, బోధనా పద్ధతులపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంతోష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు సివిల్ సర్వీసెస్ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వసతులు కల్పిస్తోందన్నారు.