న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియా షూటింగ్ టీమ్‌లో ఇషా విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో చోటు దక్కించుకుంది. సెలెక్షన్ ట్రయల్స్‌లో సూపర్ ఫామ్ చూపెట్టిన మను భాకర్‌కు రెండు కేటగిరీల్లో చాన్స్ లభించింది. 25 మీటర్ల పిస్టల్‌లో ఇషాతో పాటు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రిథమ్ సంగ్వాన్‌తో కలిసి మను బరిలోకి దిగనుంది.
ఓవరాల్‌గా రైఫిల్, పిస్టల్ కేటగిరీలో మొత్తం 15 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఎనిమిది మంది రైఫిల్ షూటర్లు కాగా, ఏడుగురు పిస్టల్ షూటర్లు ఉన్నారు. ట్రయల్స్‌లో నిరాశపర్చిన వరల్డ్ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్‌కు బెర్త్ కన్ఫామ్ కాలేదు. తను ఒలింపిక్ కోటా విన్నర్ అయినా సరైన ఫామ్‌లో లేకపోవడంతో పక్కనబెట్టారు.